విజయ్ ఆత్మహత్య : సొంత సినిమా ఆగిపోయింది.. కుటుంబంలో గొడవలు

vijayటాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని తన సొంత ఫ్లాట్ లో ఆయన ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఫ్యామిలీతో గొడవలు… సినిమాల్లో అవకాశాలు తగ్గడం.. ఎంత కష్టపడినా బ్రేక్ రాకపోవడం… పెట్టుబడి పెట్టిన సినిమా విడుదల కాకపోవడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా విజయ్ సాయి డిప్రెషన్ లో ఉంటున్నాడని అతడి స్నేహితులు చెప్పారు. విజయ్ సాయిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసినట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి.

విజయ్ ఆత్మహత్యకు.. భార్య వనిత వేధింపులు కూడా కారణం అంటున్నారు కుటుంబ సభ్యులు. టీవీ సీరియళ్లలో నటించే వనితను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె. విజయ్‌ – వనితకు మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. డబ్బు కోసం వనిత విజయ్‌ ను తరచూ వేధించేదని.. మూడు రోజుల క్రితం భర్త నుంచి కారును కూడా బలవంతంగా తీసుకెళ్లిందని విజయ్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయంపై కూడా దర్యాప్తు చేస్తాం అని చెబుతున్నారు పోలీసులు.

కామెడీ టైమింగ్.. తనదైన బాడీ లాంగ్వేజ్ తో విజయ్ సాయి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే.. కొన్నాళ్లుగా ట్రెండ్ బాగా మారిపోయింది. ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉంటున్న విజయ్ సాయి.. కొన్ని పెద్ద ప్రాజెక్టుల్లో హాస్యనటుడిగా అలరించాడు. కొన్ని లో-బడ్జెట్ సినిమాల్లో హీరోగానూ నటించాడు. ఐతే.. చాలా సినిమాలు హిట్టు కాకపోవడంతో.. ఆఫర్లు తగ్గిపోయాయి. నిషాకొఠారీ హీరోయిన్ గా క్రిమినల్స్ అనే సినిమా నిర్మించినా ఆ మూవీ విడుదల కాలేదు. వ్యక్తిగతంగా కుటుంబంలో కలహాలు ఉన్నాయని స్నేహితులు చెబుతున్నారు. మానసిక సంఘర్షణలోనే ఇంట్లో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడని అంటున్నారు.

డైరెక్టర్ రవిబాబు విజయ్ సాయిని ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన  అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, సోగ్గాడు లాంటి సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేశాడు విజయ్ సాయి. బొమ్మరిల్లు సినిమాతో హిట్టు కొట్టినా.. ఆ తర్వాత బ్రేక్ రాలేదు. ఒకరికి ఒకరు, నువ్వేకావాలి, వేచి ఉంటా, చిరుజల్లు, యూత్, వరప్రసాద్ పొట్టి ప్రసాద్, బ్యాక్ పాకెట్, మంత్ర, మంగళ, కరెంట్, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, అలలు, అపార్ట్ మెంట్, అలలు, చుక్కలాంటి అమ్మాయి, అడ్డా, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, మిస్టర్ మన్మథ, ప్రేమలో ఏబీసీ లాంటి సినిమాల్లో విజయ్ సాయి నటించాడు. 2011లో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. అక్కడా కొన్ని సినిమాలు చేశాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy