విజయ్ మాల్యాపై ఛార్జ్ షీట్ దాఖలు

mallyapoundSBI అనుబంధ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యాపై ఇవాళ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్. మనీల్యాండరింగ్ కేసు కింద ఈ అభియోగాలను నమోదు చేసింది. అయితే భారతీయ బ్యాంకులకు కనీసం రెండు లక్షల పౌండ్లు చెల్లించాలంటూ ఇటీవ‌లే విజయ్ మాల్యాను ఆదేశించింది బ్రిటన్ హైకోర్టు. 13 బ్యాంకులకు ఆ సొమ్ము అందాలంటూ కోర్టు పేర్కొంది. స్టేబ్ బ్యాంక్ ఇండియా నేతృత్వంలోని 13 బ్యాంకులు వేసిన పిటీషన్‌ను బ్రిటన్ కోర్టు స్వీకరించింది. మే 8న జరిగిన వాదనల్లో ఆ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.  జడ్జి ఆండ్రూ హెన్‌షా ఈ తీర్పును వెలువరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులను ఫ్రీజ్ చేయాలంటూ కోర్టు ఆ తీర్పులో ఆదేశించింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు జూలై 31వ తేదీన జరగనున్నాయి. తనపై నమోదు అయిన క్రిమినల్ ఆరోపణలు నిరాధారమైనవని మాల్యా తరపున లాయర్ కోర్టులో వాదించారు. భారతీయ బ్యాంకులకు మాల్యా సుమారు 9వేల కోట్లు ఎగ్గొట్టారు. ఆ కేసులో అతన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పగింత కేసులో అతను వచ్చే నెలలో వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు కూడా హాజరుకానున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy