విజయ పాల డెయిరీ – ప్రైవేట్ వాళ్లకు లాభాల దారి

vijaya dairy - 121సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్నట్లుగా మారింది విజయ డెయిరీలో పాల సేకరణ. పాడి రైతులను ప్రోత్సహించాలని సర్కార్ భావిస్తే.. అధికారులు మాత్రం ప్రైవేట్ డెయిరీలను బలోపేతం చేస్తున్నారు. ప్రైవేట్ డెయిరీల యాజమాన్యాలతో కుమ్మకై కోట్లు రూపాయలను పక్కదారి పట్టిస్తున్నారు. విజయ డెయిరీ పాల సేకరణ తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. విజయ డెయిరీలో పాల సేకరణ ప్రైవేట్ పాల వ్యాపారులకు కోట్లు కురిపిస్తోంది. రైతులను ప్రోత్సహించేందుకు… సేకరిస్తున్న ప్రతి లీటరుకు గతంలో ఇస్తున్న 24 రూపాయలకు అదనంగా మరో 4 రూపాయలు చెల్లిస్తోంది. అయితే… విజయ డెయిరీ మాత్రం రైతుల నుంచి కాకుండా ప్రైవేట్ డెయిరీల నుంచి పాలను సేకరించి.. రైతుల కడుపుకొడుతోంది. కొన్ని ప్రైవేట్ డెయిరీలు ధర తక్కువగా వున్న రాష్ట్రాల నుంచి పాలను దిగుమతి చేసుకొని విజయ డెయిరీ సంస్థకు పోస్తున్నాయి. దీంతో అధికారుల తీరుపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

విజయ లాభాలు.. ప్రైవేటు పాలు

ప్రతి రోజు విజయ డెయిరీ అధికారులు 5 లక్షల 27 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. అందులో ప్రైవేటు డెయిరీల నుంచే దాదాపు 75 వేల నుండి లక్ష లీటర్ల వరకు.., మరో లక్షన్నర లీటర్లను దళారులు, బినామీల నుంచి సేకరిస్తున్నారు. సరిత డైరీ నుంచి 23 వేల లీటర్లకు పైగా సేకరిస్తే.. MNR డెయిరీ నుండి 4 వేల లీటర్ల వరకు సేకరిస్తోంది. ఇక సుజాత డైరీ నుంచి 4వేల లీటర్లు, ధరణి డైరీ నుండి 8వేల లీటర్లు, సిరి డెయిరీ నుంచి మరో నాలుగు వేల లీటర్లు, దక్కన్ అగ్రో డైరీ నుంచి రెండు వేల 500 లీటర్లు, కపిల డెయిరీ నుంచి 5 వేల లీటర్లు.. లక్ష్మినర్సింహా డైరీ నుంచి మరో 5 వేల లీటర్లు, సాంబశివ డైరీ 9 వేల 105 లీటర్ల పాలను విజయ డెయిరీ సేకరిస్తోంది.

విజయ డెయిరీ పాలు మార్కెట్లో అమ్ముడుపోతున్నాయా.. అంటే అది కూడా లేదు. గతేడాది వరకు అంటే సర్కార్ ప్రోత్సాహం ప్రకటించక ముందు విజయ డెయిరీ ప్రతి రోజు 4లక్షల 50 వేల లీటర్లను అమ్మేది. కానీ ప్రోత్సాహం ప్రకటించిన తర్వాత పాల సేల్స్ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం విజయ డెయిరీ ప్రతిరోజు 3లక్షల 50 వేల లీటర్లనే సేల్ చేస్తోంది. కానీ పాల సేకరణ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో పాల సేల్స్ పెంచడం మానేసిన అధికారులు.. పాల సేకరణలో మునిగిపోతున్నారు.

దళారుల చేతుల్లో వ్యాపారం

ప్రొత్సాహం కింద రైతులకు దక్కాల్సిన కోట్ల రూపాయలు అధికారులే పక్కదారి పట్టిస్తున్నారు. ఏడాది కాలంలో ప్రొత్సాహకం రూపంలో 42 కోట్ల రూపాయలను  ప్రైవేట్ డెయిరీలకు, దళారులకు కట్టబెట్టారు. మరో 15 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో అప్పు చేసి మరి ప్రైవేట్ డైరీలకు చెల్లించినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

విజయ డెయిరీ పాల సేకరణలో జరగుతున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడేందుకు అధికారులెవరూ ముందుకు రావడం లేదు. కానీ లాభాల్లో వున్న డెయిరీ… అధికారుల తీరువల్లే నష్టాల పాలవుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy