విజువల్ ఎఫెక్ట్స్ తో థ్రిల్ చేసే యమలీల-2..

యమలీల సినిమా చూశారా..? 1994 లో అలీ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎంత హిట్టయిందో దెలిసే ఉంటుంది. ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమా లో చూపించిన కామెడీ, అలీ చేసిన సందడీ ఇంకా ఎవరూ మరిచిపోరు. ఇప్పుడు మరోసారి నవ్వించేందుకు ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల-2 తెరకెక్కిస్తున్నాడు. యముని పాత్రలో మోహన్ బాబు, చిత్రగుప్తుని పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. ఆల్ రెడీ ఈ ఇద్దరు రాజమౌళి డైరెక్షన్ లో యమదొంగ సినిమాలో నటించారు. మరోసారి ఈ కాంబినేషన్ రిపీటవుతుండటం తో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగిందని డైరెక్టర్ అంటున్నారు. అయితే ఈ సినిమా 1994 లో వచ్చిన యమలీలకు సీక్వెల్ కాదని ఆయన తెలిపారు. కె.వి.సతీష్, నికోలస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఈగకు వర్క్ చేసిన టెక్నీషియన్లు పనిచేస్తున్నారని తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్ ఆడియెన్స్ కు చాలా థ్రిల్ ఇస్తాయని ఆయన అన్నారు.

6 sheet-2 - High Still - 1 Still - 2

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy