వితంతువులు మళ్లీ పెళ్లిచేసుకోవాలి: హరీశ్ రావు

harishraoవితంతువులను చూసే దృక్కోణం మారాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. ఎల్బీ స్టేడియంలో జరిగిన  వితంతు  సభలో  పాల్గొన్న మంత్రి…. మహిళలకు  సర్కార్ అండగా ఉంటుందన్నారు.  మహిళలను  వేదిస్తే  పీడీ యాక్ట్  పెడతమన్నారు. వితంతువుల సమస్యల  మీద అసెంబ్లీలో చర్చిస్తామన్నారు  మంత్రి.  ఈ సందర్భంగా ఒక నెల జీతాన్ని వితంతువులకు ఇస్తున్నానని ప్రకటించారు మంత్రి.

ఎందుకు వితంతువు మళ్లీ పెళ్లి చేసుకోవద్దని ప్రశ్నించారు. సమాజంలో మార్పు రావాలసిన అవసరం ఉందన్నారు. భార్య చనిపోయిన భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పుడు భార్య ఎందుకు చేసుకోకూడదని ప్రశ్నించారు హరీశ్. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు కోసం తప్పకుండా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళల రక్షణ కోసం గ్రామాలకు షీ టీమ్స్‌ను విస్తరిస్తున్నామన్నారు. బాల్యవివాహాల వల్ల వితంతువుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గుడుంబాను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. గుడుంబాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్ఘాటించారు. కల్యాణలక్ష్మితో బాల్య వివాహాలు ఆగిపోతున్నాయన్నారు హరీశ్ రావు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy