విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెనక్కి తీస్కొస్తాం: కేంద్రం

block moneyబ్లాక్ మనీ విషయాన్ని మరోసారి స్క్రీన్ పైకి తీస్కొచ్చింది కేంద్రం. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిన్నరలో 16 వేల కోట్లు గుర్తించామన్నారు అధికారులు. పోయిన 20 నెల్లలో ఈ బ్లాక్ మనీని కనిపెట్టినట్లు చెప్పారు. ఇక 12వందల కోట్ల విలువైన ఆస్తులు కూడా జప్తు చేశామని అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 2014 మార్చి నుంచి 2015 నవంబర్ వరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన రైడ్స్ లో.. ఈ ఆస్తుల్ని జప్తు చేశామంది.  774 కేసులు ఫైల్ చేసినట్లు తెలిపింది.

స్వచ్చందంగా నల్లధనాన్ని అందజేసేందుకు ప్రభుత్వం అరేంజ్ చేసిన వన్ టైం 90 డేస్ విండోకి  మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు  కేంద్ర అధికారులు. ఇప్పటి వరకు 4 వేల 160 కోట్ల రూపాయల విలువ చేసే బ్లాక్ మనీకి సంబంధించి.. 6 వందల 35 ప్రకటనలు వచ్చాయన్నారు. ట్యాక్స్ లు, ఫైన్ లే.. 2 వేల 5 వందల కోట్లు ఈనెలాఖరులోగా వస్తాయని లెక్కలేస్తోంది సర్కార్. బ్లాక్ మనీపై చాలా సీరియస్ గా వర్క్ నడుస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy