విద్యన్నకు నివాళి… కంటతడి పెట్టిన సీఎం

kcrప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు పార్థివ దేహాన్ని  ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి నివాళులర్పించారు.   హబ్సిగూడ లోని విద్యాసాగర్ రావు ఇంటికి సతీ సమేతంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానభూతి తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ చేరుకున్న  ముఖ్యమంత్రి విషణ్ణ వదనంతో కనిపించారు.  విద్యాసాగర్ రావు లేని లోటు భర్తీ చేయలేనిదని అన్నారు. విద్యాసాగర్ రావుతో వున్న అనుబంధాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచుకున్నారు.

నీళ్లు – నిజాలు అనే పుస్తకం రాసి సాగునీటి రంగంపై అందరికి అవగాహన కల్పించారన్నారు.  గొప్ప తెలంగాణ వాది అని, తెలంగాణ  రావాలనే తపన పడే వారని గుర్తు చేసుకున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నో సభల్లో, సదస్సుల్లో  మాట్లాడారన్నారు.  తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని  ప్రతీ చోట వివరించుకుంటూ వచ్చాడన్నారు.  రాష్ట్ర సాధన జరిగిన తరువాత కూడా నీటి పారుదల శాఖ రంగంలో విశేషమైన సేవలు అందించారన్నారు.  నీటి పంపకం విషయంలో జరిగిన సమావేశాల్లో కూడా తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించే వారని సీఎం అన్నారు. ఆయనకున్న అపార అనుభవం, సాధికారత వల్ల ఎదుటి వారు ఎదరు చెప్పడానికి కూడా సాహసించేవారు కాదన్నారు.  విద్యాసాగర్  రావు మరణం వల్ల తెలంగాణకు తీరని నష్టం కలిగిందన్నారు.

విద్యాసాగర్ రావు అందించిన సేవలకు గుర్తుగా రాష్రంలో ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.   ఏ ప్రాజక్టుకు విద్యాసాగర్ రావు పేరు పెట్టాలో నిర్ణయించి  ప్రతిపాదనలు పంపాలని నీటి పారుదల శాఖను సీఎం ఆదేశించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy