విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు : కేరళ సీఎం

వరదలతో అతలాకుతలమవుతున్నకేరళను అన్నివిధాల ఆదుకునేందుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తున్నది. సర్వం కోల్పోయిన అన్నివర్గాలవారికి అండగా నిలుస్తున్నది. వరదల్లో పాఠ్యపుస్తకాలు కోల్పోయిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించనున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

వరదల్లో పాఠ్యపుస్తకాలు కొట్టుకుపోయిన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన మత్స్యకారులను సీఎం అభినందించారు. వారికి అవసరమైన ఖర్చులు అందించనున్నట్లు తెలిపారు. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ తమ బోట్లను సహాయ సిబ్బందికి  అప్పగిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy