విద్యార్థులకు భరోసా : ఆందోళన వద్దు.. బాకీ తీర్చేస్తాం

rajendar201715తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా కల్పించిన మాట వాస్తవమని స్పష్టం చేశారు మంత్రి. బుధవారం (నవంబర్-15)న అసెంబ్లీలో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా.. వివరణ ఇచ్చారు మంత్రి ఈటల రాజేందర్. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఫీజు రియింబర్స్‌మెంట్‌తో సంబంధం లేదని తేల్చిచెప్పారు. 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే.. రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇంకా విద్యార్థుల డాటా అప్‌లోడ్ కాలేదని చెప్పారు. అడ్మిషన్లలో తేడా దృష్ట్యా ఏ అకాడమిక్ ఇయర్ రీయింబర్స్‌మెంట్ ఆ ఇయర్‌లో చెల్లించడం కుదరదన్నారు మంత్రి. త్వరలోనే బాకీలను కచ్చితంగా తీరుస్తామన్నారు. ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలను పెంచామని గుర్తు చేశారు మంత్రి.

కళాశాల అనుబంధ వసతి గృహ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూ. 900 నుంచి రూ. 1500లకు పెంచామన్నారు. ఇంటర్ విద్యార్థులకు రూ. 520 నుంచి రూ. 750కు పెంచామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు మంత్రి. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని ప్రతిపక్ష పార్టీల నేతలకు సూచించిన ఈటల.. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని తెలిపారు మంత్రి ఈటల.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy