విద్యార్థులను పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే : సీపీ

సమాజాభివృద్ధిలో…. పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్లదే అగ్రస్థానమన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ . టీచర్ అంటే ఫ్రెండ్ , ఫిలాసఫర్ , గైడ్ లా ఉంటాడని చెప్పారు. అందుకే పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులకు చెక్ పెట్టడంలో టీచర్లు కీలక పాత్ర పోషించాలన్నారు.

ఈ అంశంపై అవేర్ నెస్ ప్రొగ్రామ్ నిర్వహించారు హైదరాబాద్ పోలీసులు. చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు శనివారం (ఆగస్టు-18) హైదరాబాద్ లో అవేర్ నెస్ ప్రొగ్రామ్ నిర్వహించారు హైదరాబాద్ పోలీసులు. టీచర్లకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా.. వారిలో మంచి ప్రవర్తన కల్పించాలన్నా… గురువులదే కీలక పాత్ర అన్నారు సీపీ అంజనీ కుమార్. బషీర్ బాగ్ లోని భరోసా సెంటర్ లో ఎనఫ్ ఈజ్ ఎనఫ్ పేరుతో వర్క్ షాప్ ప్రారంభించారు సీపీ అంజనీ కుమార్. ప్రభుత్వ స్కూళ్లకి చెందిన టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గతంలో టీచర్ అంటే భయం ఉండేదని.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు సీపీ అంజనీ కుమార్. సమాజంలో జరిగే మంచి, చెడులను పిల్లలకు వివరించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. యుక్త వయస్సు క్లీన్ స్లేట్ లాంటిదని.. ఆ స్లేట్ పై రాసే ప్రతి అక్షరం ఏవిధంగా ఉంటుందో.. వారి జీవితం అదే మాదిరిగా ముందుకు వెళ్తుందన్నారు సీపీ.

ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకొని స్కూల్ విద్యార్థుల్లో లైంగిక దాడులకు సంబంధించిన అవగాహన కల్పించాలన్నారు.

పిల్లలపై జరిగే లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయాలంటే ఉపాధ్యాయుల సహకారం అవసరమన్నారు అదనపు కమిషనర్ షికా గోయల్ . అందుకే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆరువందల స్కూళ్లలో.. ప్రతి స్కూల్ నుంచి ఇద్దరు టీచర్లకు వర్క్ షాప్ ఏర్పాటు చేశామన్నారు. మూడు నెలల్లో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు వర్క్ షాప్ ను పూర్తి చేస్తామన్నారు.

పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠినంగా ఉండాలన్నారు విద్యాశాఖ అధికారులు. సమాజంలో జరిగే మంచి, చెడులను పిల్లలకు వివరించేందుకు టీచర్లు స్నేహితులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహన కార్యక్రమాలతో కొంచెం మార్పు తేవొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ముందుగా టీచర్లకు అవేర్ నెస్ కల్పించి.. వారితో పిల్లలకు చెప్పించేలా ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy