విద్యార్థులు రేపు క్యాంపస్ కు రావొద్దు

lucknow universityవాలంటైన్స్ డే సందర్భంగా రేపు(బుధవారం,ఫిబ్రవరి-14) విద్యార్థులు క్యాంపస్‌లోకి రావొద్దంటూ లక్నో వర్శిటీ ఆదేశాలు జారీచేసింది. వాలంటైన్స్ డేతో పాటు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం(ఫిబ్రవరి-14) వర్శిటీకి సెలవు ప్రకటించామని.. విద్యార్థులెరూ క్లాసుల్లోగానీ, క్యాంపస్ ప్రాంగనంలో కానీ కనిపించొద్దని యూనివర్సిటీ అధికారులు క్యాంపస్ లో నోటీసులు అంటించారు. గతంలో కొంతమంది విద్యార్థులు వాలంటైన్స్ డే సమయంలో సంస్కృతి,సంప్రదాయాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని వర్శిటీ అధికారి వినోద్ సింగ్ తెలిపారు. రేపు(బుధవారం-14) ఎలాంటి క్లాస్ లు, సాంస్కృతిక కార్యక్రమాలుకానీ నిర్వహించేది లేదనే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తుంచుకుని..తమకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy