విద్యుత్ శాఖలో 1422 ఏఈ పోస్టులు

1421399622_Jagadeesh for London1,422 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే TSPSCతో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్.. విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెన్ కో, ట్రాన్స్ కో డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఓకే చెప్పింది. 14వందల 22 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెప్పారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ట్రాన్స్ కోలో 206 పోస్టులు, SPDCLలో 201, NPDCLలో 159, జెన్కోలో 856 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తునట్లు తెలిపారు. ట్రాన్స్ కోలో 184 ఎలక్ట్రికల్, 22 సివిల్ పోస్టులు, జెన్కోలో 419 ఎలక్ట్రికల్, 172 సివిల్, ఎలక్ట్రానిక్స్ 70, మెకానికల్ లో 195 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు అన్ని కంపెనీలకు పోటీ పడవచ్చన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అభ్యర్ధులు అన్ని పరీక్షలు రాసేందుకు వీలుగా ఎగ్జామ్స్ ను వేరువేరు డేట్స్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. NPDCL పరీక్షను నవంబర్ 8న, జెన్కో ఎగ్జామ్ ను నవంబర్ 14న, SPDCL నంబర్ 22న, ట్రాన్స్ కో నవంబర్ 29న పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ పరీక్షల బాధ్యతను JNTUకి అప్పగించామన్నారు. డిసెంబర్ లోపు నియమకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.  ఉద్యోగాలి ఇప్పిస్తామని ఎవరైనా ప్రలోభపెడితే నమ్మొద్దన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే 83329 83914 నెంబర్ కు ఫొన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy