విధ్వంస రామా..! ‘వినయ విధేయ రామ’ రివ్యూ

రివ్యూ: వినయ విధేయ రామ

రన్ టైమ్: 2 గంటల 26 నిమిషాలు

నటీనటులు: రామ్ చరణ్,కియరా అద్వానీ,వివేక్ ఒబెరాయ్,ప్రశాంత్,స్నేహా,ఆర్యన్ రాజేశ్ తదితరులు

మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ,ఆర్థర్.ఎ.విల్సన్

మాటలు: ఎం.రత్నం

నిర్మాత: డి.వి.వి దానయ్య

కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: బోయపాటి శ్రీను

రిలీజ్ డేట్: జనవరి 11,2018

కథేంటి?

అనాథలైన నాలుగురికి చిన్నప్పుడు రామ్ (రాంచరణ్) దొరుకుతాడు.. అన్నయ్యలు మంచి పొజిషన్ లో ఉండాలని తను చదువు మానేసి వాళ్లను చదువుకోమంటాడు.అలా ఐఏఎస్ లు అయిన అన్నయ్యలను అనుక్షణం కాపాడుతుంటాడు.ఎలక్షన్ ఆఫీసర్ అయిన పెద్దన్నయ్య (ప్రశాంత్) ను బీహార్ లో ఉన్న రాజా భాయ్ (వివేక్ ఒబెరాయ్) టార్గెట్ చేస్తాడు.ఆపదలో ఉన్న తన అన్నయ్యలను,తన ఫ్యామిలీని రాజాభాయ్ నుండి రామ్ ఎలా కాపాడాడు అనేది కథ

నటీనటుల పర్ఫార్మెన్స్:

రంగస్థలం తర్వాత రామ్ చరణ్ లో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది..నటన లోఎలాంటి బెరుకు లేకుండా నటిస్తున్నాడు.యాక్షన్ హీరోగా చరణ్ విజృంభించాడు.కియరా అద్వానీకి చెప్పుకోతగ్గ పాత్ర దక్కలేదు.కేవలం పాటలకే పరిమితమైంది.వివేక్ ఒబెరాయ్ విలన్ గా బాగున్నా..రెగ్యులర్ పాత్ర కావటంతో తన పర్ఫార్మెన్స్ చూపించే స్కోప్ దక్కలేదు..ప్రశాంత్,స్నేహ,ఆర్యన్ రాజేశ్ తదితరులు పెద్దగా చేసిందేమి లేదు.

టెక్నికల్ వర్క్:

సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.. దేవీశ్రీ ప్రసాద్ నిరాశపరిచాడు..పాటలు వినసొంపుగా లేవు..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించాడు.యాక్షన్ బాగా కంపోజ్ చేశారు.ఆర్ట్ వర్క్ బాగుంది.నిర్మాత డబ్బుకు వెనకాడకుండా గ్రాండ్ గా తీసాడు.ఎడిటింగ్ ఫర్వాలేదు.

విశ్లేషణ:

బోయపాటి సినిమా అనగానే.. రెగ్యులర్ మాస్ సినిమా తీస్తాడు కదా,మినిమమ్ గ్యారెంటీ అనుకుంటారంతా..కానీ ‘‘వినయ విధేయ రామా’’ తో ఎవరూ ఊహించని సినిమా తీసాడు.ఇప్పటివరకు బోయపాటి కెరీర్ లో ఇలాంటి నాసిరకమైన ఊర మాస్ సినిమా తీయలేదు..దృవ,రంగస్థలం లాంటి డిఫరెంట్ సినిమాల తర్వాత చరణ్ ఇలాంటి పేలవమైన కథను ఓకే చేస్తాడని ఎవ్వరూ ఊహించరు. ఇక ఇందులో బోయపాటి తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ అంతా ఇంతా కాదు.. సెన్స్ లేని సీన్లు బోలెడన్ని.. ఫస్టాఫ్ బోయపాటి మార్క్ తో యావరేజ్ అనిపించినా.. సెకండాఫ్ లో తన మాస్ వికృత రూపం దాల్చింది.ఊహకందని సీన్లు తీసి థియేటర్ నుండి పరుగులు పెట్టించాడు బోయపాటి.. ఈ సినిమా కథను గమనిస్తే..ముందు యాక్షన్ సీన్లు అనుకొని తర్వాత కథ అల్లుకున్నట్టు కనిపిస్తుంది..ఏ సీన్లోని ఎమోషన్ కనిపించదు.సినిమాలో స్టఫ్ లేకపోవడంతో పెద్ద పెద్ద నటీనటులు కూడా తేలిపోయారు..సంక్రాంతి హాలిడేస్ లో సరదాగా ఈ సినిమా చూద్దామని వెళ్తే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు.

బాటమ్ లైన్:

బోయపాటి విధ్వంస రామా.. !!

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy