వినటానికి విడ్డూరమే అయినా : మగాళ్లపైనా అత్యాచారాలు

raped-menరేప్ ఈ పదాన్ని స్త్రీలపై అత్యాచారలకు ఉపయోగిస్తాం. అదే పురుషులపై జరిగితే.. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ.. పురుషులపై ఏంటి.. అత్యాచారాలు ఏంటి అనుకుంటున్నారా..? ఈ డౌట్ ఎవరికైనా వచ్చేదే.. అయితే తాజా నివేదికలు మాత్రం.. అది నిజమని తేలుస్తున్నాయి. పురుషులను రకరకాల పద్ధతుల ద్వారా స్త్రీలు లొంగతీసుకుంటున్నారట. అబద్ధాలు చెప్పడం, బెదిరించడం, తిట్టడం, గాసిప్స్ ప్రచారం చేయడం లాంటి పద్ధతులను ఉపయోగించి పురుషులపై మహిళలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తేలింది. లండన్ లోని లాంకష్టర్ యూనివర్సిటీ పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇలా చేయడాన్ని ‘ఫోర్స్ డ్ టు పెనెట్రేట్’ గా చెబుతున్నారు పరిశోధకులు.

ఇక్కడ మరో విషయాన్ని కూడా చెబుతున్నారు పరిశోధకలు. మగాళ్లను బలవంతం చేసేంత శక్తి సహజంగా స్త్రీలలో ఉండదు. వారి శరీర క్రమమే అలా ఉంటుంది. స్త్రీ కోరి వస్తే లొంగిపోయేవాల్లే కానీ.. కాదని చెప్పేవాళ్లు పురుషుల్లో పెద్దగా ఎవరూ ఉండరని అంటున్నారు. పైపెచ్చు అలాంటి వాళ్లను లక్కీ బాయ్ గా వర్ణిస్తుంటారు. ‘ఫోర్స్ డ్ టు పెనెట్రేట్’ కేసులలో ఎక్కువ మంది పరిచయమున్న వాళ్లు లేదా స్నేహితులైన స్త్రీలతో అత్యాచారాలకు గురవుతున్నారని తేలింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy