వినాయక నిమజ్జనం..ట్రాఫిక్ డైవర్షన్

Ganesh18వినాయక నిమజ్జనం రోజు ఎక్కడ చూసినా సందడే సందడి, ఏ గల్లీ చూసినా సంబరాలే.. సంబరాలు. మరి ట్రాఫిక్ పరిస్థితి ఏంటి..? సామాన్య జనం ఎక్కడ  వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళ కూడదు. ట్రాఫిక్ లో ఇరుక్కోవద్దంటే ఏం  చేయాలి. ఎక్కడికెక్కడ ఎదురుపడే బారీకేడ్ల ను ఎలా తప్పించుకోవాలి.

 

 

gallery2842

 • గణేస్ నిమజ్జనం రోజు అంతా సంబరాల్లోనే మునిగితేలుతారు. ఏ సందుకెళ్ళినా డప్పులు, డాన్సులు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏ రూటులో గణేష్ విగ్రహాలు నిమజ్జణానికి తరలివెల్తాయి.
 • పోలీసులు ఎక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేశారు అనే అంశాలపై అవగాహన ఉంటే ట్రాఫిక్ చిక్కుల నుంచి బటయపడొచ్చు. ఎవరికి ఇబ్బందులు కలుగకుండా హైదారాబాద్ లో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు పోలీసులు.
 • ఎక్కడికెక్కడ బారీకేడ్లు, రూట్ డైవర్షన్లతో ఎక్కడా జామ్ కాకుండా జాత్రగ్తలు తీసుకుంటున్నారు.
 • ఫోర్ వీలర్లు, బస్సులే కాదు , టూ వీలర్లు కూడా ఫ్రీగా తిరిగేందుకు అవకాశం ఉండదు. గణపతి వాహనాల ర్యాలీ ఉండే రూట్లలో నడవటానికి కూడా చోటుండదు. ఈ రూట్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను అనమతించరు. నిమజ్జన జరిగే 27 వ తేదీన ఉదయం పది నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ట్రాఫిక్ రూల్స్ అమలులో ఉంటాయి.
 • సికింద్రాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ కు తరలే విగ్రహాలతో వచ్చే వాహనాలు ఆర్పీ రోడ్, ఎంజీ రోడ్, ముషీరా బాద్ క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ నుంచి వచ్చి హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ దగ్గర ర్యాలీలో కలుస్తాయి.
 • ఓల్డ్ సిటీ నుంచి గణపతితో వచ్చే వాహనాలు చార్మినార్ మీదుగా అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా బషీర్ బాగ్ నుంచి లిబర్టీ దగ్గర ర్యాలీలో కలుస్తాయి.
 • ఉప్పల్ ఏరియా నుంచి వచ్చే గణపతి విగ్రహాలు..రామంతాపూర్, అంబర్ పేట్ మీదుగా ఓయు ఎన్సీసీ గేట్, దుర్గాబాయ్ హాస్పిటల్ మీదుగా వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ర్యాలీలో కలుస్తాయి.
 • ఈ రూట్లలో భక్తులకు , వినాయక విగ్రహాలతో వచ్చే వాహనాలకు తప్ప టూ వీలర్లకు కూడా అనుమతివ్వరు.
 •  ఆల్టర్ నేట్ రూట్ల ద్వారా గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి.
 •  27 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు నిబందనలు అమలులో ఉంటాయి. అవసరమైతే నిబందనలు పొడిగించే అవకాశం ఉంది.
 • హుస్సేన్ సాగర్ వద్ద జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు వాహనాల్లో వచ్చే వాళ్ళకు ప్రత్యేక పార్కింగ్ అవకాశం కల్పించారు.
 • ఖైరతాబాద్ జంక్షన్ లోని ఇంజనీర్స్ ఇనిస్ట్యూట్ గ్రౌండ్, ఎమ్ఎమ్ టీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ, బుద్దభవన్ బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ లోని గో సేవా సదన్, కట్ట మైసమ్మ టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం , నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్ కు ఏర్పాటు చేశారు.
 •  ఇక్కడే వాహనాలను వదిలేసి కాలినడకన ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకోవాలి.
 • ఎమర్జెన్సీగా వివిద హాస్పిటల్స్ కు వెళ్ళే వాళ్ళు , ఆపదలో ఉన్న వాళ్ళు రూట్ మ్యాప్ కోసం, సహాయం పొందేందుకు హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించారు పోలీసులు.
 •  040-27852482, 9490598985, 9010203626 నెంబర్లను సంప్రదించవచ్చు.
 • ట్రాఫిక్ నియంత్రణకు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ పోలీసులు నిమగ్నమై ఉంటారు. సీసీ కెమారాల ద్వార కంట్రోల్ రూం నుంచి ఎప్పటి కప్పుడు పోలీసు ఉన్నతాదికారులు వాచ్ చేస్తూ ఉంటారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy