వినియోగదారులకు విద్యుత్ సంస్థల బంపర్ ఆఫర్

BSESఢిల్లీలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థలు కస్టమర్లకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించాయి. డిజిటల్ విధానంలో… సరైన టైంలో కరెంట్ బిల్లుల చెల్లింపులను ప్రోత్సహించేందుకు క్యాష్ బ్యాక్ పథకాన్ని ప్రకటించాయి. మార్చి చివరి వరకు ఈ పథకం అమలవుతుందని తెలిపాయి. దీంతో వినియోగదారులకు నెలకు రూ.300 నుంచి రూ.1,200 వరకు ప్రయోజనం లభిస్తుంది. మార్చి వరకు మూడు నెలల బిల్లులకు ఈ ప్రయోజనం పొందవచ్చు. ఏప్రిల్ బిల్లును ముందుగా చెల్లిస్తే అదనపు ప్రయోజనం లభిస్తుంది.

బాంబే సబర్భన్ ఎలక్ట్రిక్ సప్లై(BSES) రాజధాని పవర్ లిమిటెడ్, BSES యమునా పవర్ లిమిటెడ్ కలిసి ఈ పథకాన్ని ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని విద్యుత్తు వినియోగదారుల కోసం ఈ ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల కోసం మొబిక్విక్ డిజిటల్ వాలెట్ కంపెనీతో అగ్నిమెంట్ కుదుర్చుకున్నాయి. 40 లక్షల కస్టమర్లు మొబిక్విక్ ద్వారా బిల్లులను చెల్లించవచ్చని తెలిపాయి.

తూర్పు, పశ్చిమ, దక్షిణ, మధ్య ఢిల్లీలోని వినియోగదారులు సకాలంలో, డిజిటల్ విధానంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి బిల్లులను చెల్లిస్తే నెలకు రూ.300 చొప్పున క్యాష్ బ్యాక్ పొందవచ్చునని ప్రకటించాయి. ఏప్రిల్ బిల్లును ముందుగా చెల్లిస్తే మరో రూ.300 క్యాష్ బ్యాక్ పొందవచ్చన్నాయి. మార్చి 31లోగా కనీసం రూ.1,000 ఏప్రిల్ బిల్లు కోసం చెల్లించాలని ప్రకటించాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy