వినియోగించుకోండి : మే-31 వరకు LRS గడువు

LRS LAST DATEలేఔట్ల క్రమబద్ధీకరణ(LRS) దరఖాస్తుల పరిష్కార గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం (మే-1)ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించింది. జిల్లా కలెక్టర్లనుంచి, ఇరిగేషన్ శాఖనుంచి ఎన్‌ ఓసీలు రావాల్సిన దరఖాస్తులు, భూ వినియోగం మార్పిడి, అన్ని షార్ట్‌ ఫాల్స్ సమర్పించి పెండింగులో ఉన్న దరఖాస్తులు, HMDA నుంచి GHMCకి, అలాగే, GHMC నుంచి HMDAకు బదిలీ అయిన దరఖాస్తులు తదితర వాటికి పొడిగించినా గడువు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

GHMC కి మొత్తం 85వేల LRS దరఖాస్తులు రాగా,  18వేల దరఖాస్తులను వివిధ కారణాలతో ఇదివరకే తిరస్కరించారు. సుమారు 23వేల దరఖాస్తులకు మాత్రమే ఏప్రిల్ 30 వరకు క్రమబద్ధీకరణ ధ్రువపత్రాలు జారీ అయ్యాయి. ఇంకా వెయ్యికి పైగా ఫీజులు చెల్లించిన దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ద్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంది.  మిగిలిన 42వేల పై చిలుకు దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఇందులో సుమారు 27వేల దరఖాస్తులకు షార్ట్‌ ఫాల్స్ ఇంటిమేషన్ లేఖలు జారీ చేయగా దరఖాస్తుదారుల నుంచి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. అలాగే, HMDA కు మొత్తం 1.75లక్షల దరఖాస్తులు రాగా, తిరస్కరించిన దరఖాస్తులు పోగా 18 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు  తెలిపారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy