వినూత్నంగా రాఖీ ఫెస్టివల్ : చెట్లకు రాఖీ కట్టిన చిన్నారులు..

rakhi5మనదేశంలో అన్నాచెల్లిల అనుంబంధానికి ప్రతీకగా చెప్పుకునే రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటామనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫెస్టివల్ ను ఒక్కో రాష్ట్రంలో  ఒక మంచి పని కోసం జరుపుకుంటున్నారు. మన రాష్ట్రాల్లో రాఖీ సందర్భంగా రాఖీ కట్టు హెల్మెట్ పెట్టు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడితే..యూపీలో ఇలాంటి ఓ వినూత్న కార్యక్రమాన్ని జరుపుకున్నారు చిన్నారులు.  రక్షాబంధన్‌ను పురస్కరించుకుని యూపీలోని లక్నో చిన్నారులు, సోదరీమణులు చెట్లకి రాఖీలను కట్టారు. ప్రాణ వాయువును అందించే చెట్లను అందరమూ కలిసి కాపాడాలని ఈ సందర్భంగా వారంతా ప్రతిజ్ఞ చేశారు. మొక్కలు పెంచండి.. పర్యావరణాన్ని కాపాడండి (పేఢ్ లగావో పర్యావరణ్)అనే నినాదంతో రాఖీని గ్రాండ్‌గా జరుపుకుని సమాజానికి సందేశాన్ని అందించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy