విప్లవ వీరుడు..తెలంగాణ ధీరుడు..

original_komaram-bheem_4ccab250cb857తెలంగాణ చరిత్రలో తొలి విప్లవ వీరుడు.. నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగ పోరాడిన ధీరుడు..దొరల పాలనకు అంతం పలికిన తెలంగాణ సమర యోధుడు దొడ్డి కొమురయ్య. ఆయన సాయుధ పోరాట స్పూర్తితోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆయన  69వ వర్ధంతి సందర్భంగా కొత్త రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజానీకం నివాళి అర్పిస్తోంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం..దొరతనాన్ని.. రాజరికాన్ని మట్టుబెపెట్టిన ఆయన  ఆదిపత్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించిన ఆ విప్లవానికి నాయకుడైయ్యాడు.

దొడ్డి కొమరయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి గ్రామం. నిజాం పాలనలో కడివెండి నల్లగొండ జిల్లాలో ఉంది. భూస్వాముల క్రూరత్వంలో వెట్టిచాకిరీలో నలిగింది. ఈ ఒక్క ఊరే కాదు సంస్థానంలోని ప్రతీ పల్లెలోనూ నిర్బంధమే..పండే పంట మీద హక్కు లేదు..పీల్చే గాలి మీద హక్కు లేదు..పటేల్,పట్వారీ దొరల రాజ్యంలో ఇలాంటి దారుణాలు చూసి గుండెలు మండిన దొడ్డి కొమరయ్య పోరాటంలో  తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుండి పోరాడాడు.

1946 సంవత్సరంలో గ్రామంలోని భూములన్నీ దొరల ఆధీనంలో ఉండేవి. కూలీలతో వెట్టిచాకిరి చేయించుకోవడం, ఎదురుతిరిగిన వారిని అంతం చెయ్యడం ఇదే ఆనాటి దొరల పాలన. రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఈ పోరాటానికి దొడ్డికొమరయ్య నాయకత్వం వహించారు. జులై 4, 1946న కొమరయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగాయి. జానమ్మ గుడి దగర్గ ర్యాలీ రాగానే నిజాం కనుసన్నల్లో పనిచేస్తున్న గుండాలు కాల్పులు జరిపారు. ముందు వరుసులో ఉన్న దొడ్డి కొమురయ్య కడుపులో తూటా దిగింది.. అక్కడిక్కడే కొమురయ్య ప్రాణాలు విడిచాడు.

కొమురయ్య అమరత్వంతో సాయుధ సమరంగా మారింది..పటేల్ ,పట్వారీ, భూస్వామ్య వ్యవస్థను కూల్చే మహా విప్లవం అయింది. బాంచన్ దొర కాల్మొక్త అన్న మనుషులతోనే గొడ్డలి పట్టిచ్చి భూస్వామ్య పునాదులను కదిలించింది. కొమురయ్య స్పూర్తితో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చిందిన ఒక్కో రక్తపు బొట్టు దోపిడీ లేని స్వేచ్చా సమాజాన్ని భావితరాలకు అందించింది. దొరల పాలనకు అంతం పలికిన కొమురయ్య స్పూర్తిని పాఠ్యాంశాల్లో చేర్చి నాటి త్యాగాలను నేటి విద్యార్థులకు అందించాలని విద్యావంతులు కోరుతున్నారు.

నిరంకుశత్వ పాలనపై నడుంబిగించి.. వీరపోరాటం చేసిన కొమురయ్య భవిష్యత్ తరాలకు మార్గదర్శి. తెలంగాణ వీరుడు కొమురయ్య నిజంగా అమరుడు. జోహార్ కొమరయ్య.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy