విభజన చట్టంలోని షెడ్యూల్ 9పై కేంద్రం వివరణ

busషెడ్యూల్ 9 లో ఉన్న 91 సంస్థల్లో విభజన పంచాయితీకి దారి చూపెట్టింది కేంద్రం. ఏ రాష్ట్రంలో ఉన్న ఆపరేషనల్ యూనిట్లు ఆ రాష్ట్రానికే చెందుతాయని తేల్చిచెప్పింది. అసలు హెడ్ క్వార్టర్ అంటే ఏమిటనేదాని మీద స్పష్టత ఇచ్చింది. ఒక సంస్థ పరిపాలన నిర్వహణ ఎక్కడ్నుంచి ఉంటే… అదే హెడ్ క్వార్టర్ అని చెప్పింది. ఆపరేషనల్ యూనిట్లను హెడ్ క్వార్టర్లుగా పరిగణించాలన్న ఏపీ వాదనను తప్పు బట్టింది హోంశాఖ. హెడ్ క్వార్టర్ కు అనుబంధంగా పని చేస్తున్న ఆపరేషనల్ యూనిట్లను.. ప్రధాన కార్యాలయాల కింద తీసుకోలేమంది. ఈ నిర్ణయానికి ముందు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు చెప్పింది. ఇదే అంశం మీద ఉత్తర్వులు ఇచ్చింది.

ఆర్టీసీ, పైనాన్స్ కార్పొరేషన్, ఆగ్రో ఫుడ్స్, డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్, సీడ్స్ కార్పొరేషన్, బెవరేజస్ కార్పొరేషన్, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. ఇలా మొత్తం 91 సంస్థలు 9వ షెడ్యూల్ ల ఉన్నాయి. వీటిని రెండు రాష్ట్రాలకు పంచేందుకు.. 2014లో కేంద్రం ఓ కమిటీ వేసింది. ఇప్పటివరకు అధ్యయనం చేసిన కమిటీ.. విభజన చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం.. ఈ సంస్థల అప్పులు, ఆస్తులు పంచుకోవాలని చెప్పింది.  ఒకే ప్రాంతంలో సంస్థలుంటే విభజన చట్టంలోని సెక్షన్ 53(1) కింద.. ఆ సంస్థ ఏ రాష్ట్ర భూభాగంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతుందని చెప్పింది. ఒకవేళ హెడ్ క్వార్టర్ ఒక దగ్గర, దాని ఆపరేషనల్ యూనిట్లు మరో రాష్ట్రంలో ఉంటే .. హెడ్ క్వార్టర్ ను మాత్రమే జనాభా లెక్కన రెండు రాష్ట్రాలు పంచుకోవాలని చెప్పింది.

ఆర్టీసీ ప్రధాన ఆఫీసు … బస్ భవన్ ఒక్కటే పొత్తులో ఆస్తిగా తేల్చింది. మిగిలిన అన్ని ఆస్తులు తెలంగాణకు చెందుతాయని, ఇందులో ఏపీఎస్ ఆర్టీసీకి ఎలాంటి హక్కులేదని తేల్చింది. అవి ఉమ్మడి ఆస్తుల కిందకు రాదని చెప్పింది. 9వ షెడ్యూల్ లోని ఆర్టీసీతో పాటు మరికొన్ని సంస్థల ఆస్తుల విభజన మీద…  మార్గదర్శకాలతో కూడిన లేఖను రెండు రాష్ట్రాలకు పంపింది కేంద్ర హోంశాఖ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy