విభజన వల్లే ఏపీలో అభివృద్ధి: కేటీఆర్

kkr schoolsటీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుందని ఆనాడు లేనిపోని అపోహలు సృష్టించారని మంత్రి కేటీఆర్ అన్నారు. విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లకు ఏమైనా కష్టం కలిగిందా అని మంత్రి అన్నారు. విడిపోవడం వల్లే ఏపీలో ఇవాళ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.  హైదరాబాద్ మీర్‌పేటలో ఏర్పాటు చేసిన స్కూళ్ల మహాసభలో పాల్గొన్న కేటీఆర్…విభజన జరగకుంటే ఏపీలో అమరావతి వంటి గొప్ప నగరం నిర్మాణం జరిగేదా… అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐఎం, ఐఐటీలు వచ్చేవా? అని ప్రశ్నించారు. రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ది కొనసాగుతుందని వివరించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. షబీర్ ఆలీ వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడటంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. వాళ్లు 60 ఏళ్లు పాలన చేసినా చేయనలేని అభివృద్ధిని 18 నెలల్లో చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు అనేవి సామాన్యం జరిగేవని మంత్రి గుర్తు చేశారు. కానీ ఇవాళ సీఎం కేసీఆర్ పాలనలో  రాష్ట్రం వెలిగిపోతోందన్నారు.  రాష్ట్రం విడిపోతే కరెంట్ ఉండదని రాష్ట్రం అంధకారంలో ఉంటుందని లేనిపోని అపోహలు సృష్టించారన్న మంత్రి కేటీఆర్…ఇవాళ ఆయన రాజకీయ జీవితమే చీకటిమయమైందని విమర్శించారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy