విమర్శల దర్బార్ గా మారిన యూపీ ‘జనతా దర్భార్’..

aziz-qureshi-credits-narendra-modi-for-appointment-as-uttar-pradesh-governorఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చారు. తన దైన శైలిలో ఆయన జనతా దర్బార్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు గవర్నర్ అజీజ్ కురేషీ. ప్రజల అవసరాలు, సమస్యలు తీర్చేందుకు డైలీ ఈ దర్బార్ ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆయనకు యూపీతో పాటు ఉత్తరాఖాండ్ రాష్ట్రానికి సంబంధించి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లు రాజీనామా చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. దీంతో యూపీ గవర్నర్ జోషీ రాజీనామా చేశారు. దీంతో కొత్త గవర్నర్ గా కురేషీకి అవకాశం వచ్చింది. వచ్చీ రాగానే తన స్టైల్ తో ఎవరికీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తనకు అనవసరమని..రాజ్ భవన్ డోర్లు పేద ప్రజల కోసం  ఎప్పటికీ తెరచే ఉంటాయన్నారు. స్థానిక బీజేపీ పార్టీలో దీని గురించి వ్యతిరేకత వచ్చింది. బీజేపీ నేత లక్ష్మీకాంత్ బాజ్ పేయ్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెడు రోజులు వచ్చాయని… విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం గవర్నర్ కు ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. స్థానిక ప్రభుత్వ నేతలు కూడా గవర్నర్ దర్బార్ పై విమర్శలు చేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy