విమానంలో స్టార్స్ హంగామా… మోడీ మీటింగ్ ఎఫెక్ట్

మూవీ స్టార్స్ ఒక్కచోట కలిస్తే ఆ సందడే వేరు. ఇలాంటి సందర్భాలు చాలా రేర్ గా వస్తుంటాయి. కలిశారంటే…  అప్పుడుండే హంగామానే వేరు. అది స్టూడియో అయినా…. ఈవెంట్ అయినా.. ఆఖరుకు ఫ్లైట్ అయినా అంతే అని నిరూపించారు బాలీవుడ్ క్రేజీ స్టార్స్. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్, వరుణ్ ధావన్, రాజ్ కుమార్ రావ్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఆయుష్మాన్ ఖురానా, రోహిత్ శెట్టి, అశ్విని అయ్యర్, ఏక్తాకపూర్, ఆలియాభట్ ఇలా… చాలామంది ఓ టీమ్ గా ఢిల్లీ వెళ్లారు. గురువారం ప్రధానిని కలిసి సినిమా ఇండస్ట్రీ, కేంద్రం పాలసీలపై చర్చించారు. టికెట్ ధరలపై జీఎస్టీ తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐతే… ప్రధానిని కలిసేందుకు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తూ ఈ స్టార్ హీరోలు ఆకాశంలో చేసిన హంగామా ఇపుడు వైరల్ గా మారింది. స్టార్స్ అంతా స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లారు. వాళ్లందరితో ఒక్కొక్కరితో కరణ్ జోహార్ మాట్లాడించారు. ఉరి సినిమాకు ప్రమోషన్ చేశారు. వాళ్లు చేసిన హంగామా అంతా ఓసారి మీరూ చూసేయండి.

View this post on Instagram

Flight of fancy! 😍

A post shared by Karan Johar (@karanjohar) on

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy