విమానంలో 8 అడుగుల పాము: పైలట్లకు ముచ్చెమటలు

imagesఎయిర్ ఫోర్స్ విమానం రెక్కలో 8 అడుగుల పాము దూరింది. దీంతో పైలట్లకు ముచ్చెమటలు పట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. ఆగ్రాలోని భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేస్‌లో ఏఎన్ 32 యుద్ధ విమానం నిలిచి ఉంది. శుక్రవారం (జూలై 7) దీని రెక్క భాగంలోకి 8 అడుగుల పొడవైన కొండ చిలువ దూరింది. గమనించిన ఫ్లైట్ సిబ్బంది ఈ విషయాన్ని అటవీశాఖ‌కు తెలిపారు. పాములు పట్టే సిబ్బంది సుమారు ఐదు గంటలు శ్రమించి దాన్ని పట్టుకున్నారు. ఈ ఐదు గంటలు వణికిపోయారు పైలట్లు. ఫ్లయిట్ గాల్లో ఉన్నప్పుడు పాము బయట పడి ఉంటే పరిస్థితి ఏంటీ.. ఇది ఊహించుకుని మరీ భయంతో చెమటలు కక్కారు. ముందుగా కనపించటంతో సరిపోయింది అంటూ ఊపిరిపీల్చుకున్నారు. పామును పట్టుకున్న తర్వాత కూడా.. ఫ్లయిట్ మొత్తాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy