విమెన్ వాల్డ్ కప్: ఇంగ్లాండ్ టార్గెట్ 282

madanaమహిళల వన్డే వాల్డ్ కప్ లో ఇంగ్లాండ్ కు 282 పరుగుల టార్గెట్ నిర్దేశించింది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు..  నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 26.5 ఓవర్లలో 144 పరుగులు జోడించారు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. అయితే… ఓపెనర్ మంధన(92) కొద్దిలో సెంచరీ మిస్ చేసుకుంది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ హాఫ్ సెంచరీ (86), కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి స్కోరు బోర్డును నడిపించింది. 222 పరుగుల వద్ద హజెల్ బౌలింగ్ లో రౌత్ రెండో వికెట్ గా నిష్ర్రమించింది. కాగా చివర్లో కెప్టెన్ మిథాలీ రాజ్ (73 బంతుల్లో 71: 8 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్‌ (22 బంతుల్లో 26) వేగంగా ఆడటంతో 50 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి నైట్ బౌలింగ్ లో మిథాలీ ఔటయింది. ఇంగ్లండ్ బౌలర్లలో నైట్ రెండు వికెట్లు తీయగా, హజెల్ కు ఓ వికెట్ దక్కింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy