విరసం నేత వరవరరావు అరెస్ట్

విరసం నేత వరవరరావును పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా హైదరాబాద్ అశోక్ నగర్ లోని అయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించగా పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అక్కడ నుండి ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను పూణేకి తరలించి…రేపు(ఆదివారం) ఉదయం పూణే కోర్టులో హాజరుపర్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధాని మోడీ హత్యకు కుట్రకు అయన సహకరించారని అభియోగం ఉంది. ఈ కేసుకు సంబంధించి రెండు నెలలుగా గృహ నిర్భందంలో ఉన్నారు వరవరరావు.

వరవరరావు అరెస్టు తీరుపై తీవ్రంగా స్పందించారు ఆయన కూతురు పవన. దొంగను అరెస్టు చేసినట్లు తీస్కెళ్లారని ఆరోపించారు. ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదని…అరెస్టుకు సంబంధించి ప్రజా సంఘాలు, న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy