విరాట్ సేన విలవిల

cricవిరాట్ సేన విలవిలలాడింది. ఆసీస్ బౌలర్ల దెబ్బకు కంగారెత్తారు భారత బ్యాట్స్ మెన్. టపటపా వికెట్లు పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక తికమకపడ్డారు. క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లే వెనుదిరుగుతుంటే.. మరింత ఒత్తిడి పెంచింది ఆసీస్ టీమ్. ఏ దశలోనూ టీమిండియా బ్యాట్స్ మెన్లను క్రీజ్ లో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. కేవలం ఐదు పరుగులు చేశారంటే కోహ్లీ జట్లు ఏ విధంగా ఆడిందో అర్థం అవుతుంది. 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది టీమిండియా.

కెప్టెన్ కోహ్లీ ఖాతా తెరకుండానే అవుటైతే… మిగిలిన బ్యాట్స్ మెన్ ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాటపట్టారు. కంగారుల బౌలింగ్ ధాటికి పేకమేడలా కూలిపోయింది భారత బ్యాటింగ్ లైనప్. ఒక్క రాహుల్(64) తప్ప ఎవరూ చెప్పుకోతగ్గ స్కోర్ చెయ్యలేదు. 32వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన కీఫె మొత్తం 3 వికెట్లు తీసుకున్నాడు. రెండో బంతికి రాహుల్, నాలుగో బంతికి రహానే, ఆరో బంతికి సాహాను ఔట్ చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ కు వచ్చిన లియోన్ మూడో బంతికి అశ్విన్ ను ఔట్ చేశాడు.  ఆసీస్ బౌలర్లలో కీఫె ఆరు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్ 2 వికెట్లు తీసుకోగా.. లియోన్, హాజిల్ ఉడ్ చెరో వికెట్ తీసుకున్నారు.

స్కోర్ బోర్డ్:

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : 260 ఆలౌట్, రెన్షా 68, స్టార్క్ 61 పరుగులతో టాప్ స్కోరర్స్ గా నిలిచారు.

భారత్ ఇన్నింగ్స్: విజయ్(10), రాహుల్(64), పుజారా(6), కోహ్లీ(0), రహానే(13), అశ్విన్(1), సాహా(0), జడేజా(2), యాదవ్(2), యూటీ యాదవ్(4)

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy