విరిగిపోయిన తలను అతికించారు..!!

Tony-Cowan

ఈయన తలనే ఆపరేషన్ చేసి అతికించారు

యాక్సిడెంట్ లో తల, వెన్నుపూస వేరయ్యాయి

సుసాధ్యం చేసిన భారత సంతతి న్యూరో సర్జన్ అనంత్ కామత్

హెల్త్ కేర్ లో సంచలనం నమోదైంది. హెడ్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు తొలి అడుగుపడింది. ఇప్పటిదాకా హార్ట్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్న డాక్టర్లు… ఫ్యూచర్లో హెడ్ ట్రాన్స్ ప్లాంటేషన్ ను కూడా సుసాధ్యం చేసే దిశగా… ముందడుగు వేశారు. బ్రిటన్ లోని భారత సంతతి న్యూరో సర్జన్ అనంత్ కామత్ ఈ ఘనత సాధించాడు. బ్రిటన్ లోని న్యూకాజిల్ కు చెందిన టోని కోవాన్ కు సెప్టెంబర్ 9న కారు యాక్సిడెంట్ జరిగింది. స్పీడ్ గా వెళ్లి ఓ టెలిఫోన్ స్థంబానికి కారు గుద్దుకోవడంతో ఒక్కసారిగా అతడి గుండె ఆగిపోయింది. వెంటనే హాస్పిటల్ కు తరలించి ట్రీట్ చేయగా ప్రాణాలు దక్కాయి. కానీ వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. తలభాగం మొత్తం వెన్నుపూస నుంచి పక్కకు జరిగిపోయింది. కేసును స్పెషల్ గా ట్రీట్ చేసిన డాక్టర్ అనంత్ కామత్ టోనీ కోవాన్ కు ఆపరేషన్ చేశాడు. మెటల్ ప్లేట్లు, బోల్టులు అమర్చి తలను యథాస్థానంలోకి తెచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో కోవాన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. త్వరలోనే అతను సాధారణ జీవితం గడపబోతున్నాడు. డాక్టర్ అనంత్ కామత్ పై హెల్త్ కేర్ ఇండస్ట్రీ ప్రశంసలు కురిపిస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy