వివాదాస్పదంగా మోడీ పోస్టర్

r sbx fnl modi sant poster vo 0110 mks 01365423ప్రధాని నరేంద్రమోడీని…మహాత్మాగాంధీతో పోల్చుతూ ఢిల్లీలో వెలసిన వాల్ పోస్టర్లు వివాదం రేపుతున్నాయి. స్థానిక బీజేపీ నేత విజయ్ గోయల్ ఢిల్లీలోని తన ఇంటి దగ్గర పోస్టర్లను వేయించాడు. సబర్మతీ మహాత్ముడు మోడీ అంటూ పోస్టర్లలో పేర్కొనడంతో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన గోయల్ పోస్టర్లో గాంధీజీ చేసింది చెప్పాను…మోడీ చేసింది చెప్పాను. ఇద్దరూ సబర్మతి నుంచే వచ్చారని చెప్పుకొచ్చారు. గాంధీజీ చూపిన బాటలోనే  ప్రధాని మోడీ కూడా నడుస్తున్నారన్నారు. ఏదేమైనా మోడీని ..గాంధీజీతో పోల్చడంతో పాటు పోస్టర్లు వేయటంపై రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy