వివాహంతో ఒకటైన జహీర్, సాగరిక

sagarika zaheer-khanటీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్ తన ప్రేయసి, బాలీవుడ్‌ నటి సాగరిక వివాహం చేసుకున్నాడు. ఇవాళ ఉదయం జహీర్‌-సాగరికలు ముంబై రిజస్టర్‌ ఆఫీసులో వివాహం చేసుకున‍్నారు. ఈ పెళ్ళి ఫొటోల‌ను జ‌హీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్‌నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజ‌నా శ‌ర్మ  షేర్ చేశారు. ఈనెల 27న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గనుంది. ఈ కార్యక‍్రమానికి బాలీవుడ్‌ సెలబ్రెటిలతో పాటు, జహీర్‌ ఖాన్‌ స్నేహితులు హాజరుకానున్నారు.  వివాహ రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌ను సాగ‌రిక స్నేహితురాలు, చ‌క్ దే ఇండియాలో ఆమె స‌హ‌న‌టి విద్యా మాల్వంక‌ర్ షేర్ చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy