
1863 జనవరి 12న కలకత్తాలో లాయర్ విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరీదేవి దంపతులకు వివేకానందుడు జన్మించారు. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏర్పాటు చేసిన స్కూల్లో నరేన్ ఒకటో తరగతిలో చేరారు. వేణీగుప్తా, ఉస్తాద్ అహ్మద్ ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. హార్మోనియం, ఫిడేల్ పై పట్టుసాధించారు. చిన్నతనం నుంచే లా, సైన్సు పుస్తకాల్ని.. ఉపనిషత్తులు, పురాణాలనూ చదివేవారు.
వివేకానందుడు మల్టీ టాలెంటెడ్. ప్రతీ రంగంలోనూ ఆయనికి పట్టుంది. దొరికిన ప్రతీ పుస్తకాన్ని తిరగేసేవారు. అన్ని మత గ్రంథాలను చదివారు. కానీ ఆధ్యాత్మిక చింతన ఆయన జీవితాన్నే మార్చేసింది. దేవుడ్ని చూసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న ఆయన్ను… రామకృష్ణ పరమహంస దగ్గరకు చేర్చింది. ఆయన శిష్యరికంలోనే సన్యాసిగా మారారు. దేశంలోని యువత, ప్రజలు పూర్తిగా తప్పుదారి పట్టారని భావించిన వివేకానంద.. వారికి మార్గనిర్థేశం చేసేందుకు. ఎలా బతకాలో తెలిపేందుకు దేశమంతా యాత్ర చేశారు.
1893 సెప్టెంబర్ 11న అమెరికాలో ఆయన చేసిన ప్రసంగం మరువలేనిది. ఆ ఒక్క ప్రసంగంతోనే వివేకానందునికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఏడేళ్ల పాటు వివేనందుడు అమెరికా, యూరప్ లలో తన గళాన్ని వినిపించారు. రామకృష్ణ పరమహంస తదనంతరం ఆయన పేరుమీద మఠాన్ని ప్రారంభించారు. ఆర్కే మట్ ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి చేశారు.
దేవుడు మనుషుల్లోనే ఉన్నాడన్న వివేకానందుడి 153వ జయంతి ఇవాళ. ఆయన బతికిన 39ఏళ్లూ అవిశ్రాంతంగా గడిపారు. ఆయనకు దేశమంటే వల్లమాలిన అభిమానం. ఆ దేశభక్తితోనే అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. 1902 జులై 4న 39ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భూమ్మీద గడిపినన్ని రోజులూ సాధువులా ఆనందంగా జీవించిన వివేకానందుడి మరణం.. శిష్యులకు శోకాన్నే మిగిల్చింది. ఆయన నెలకొల్పిన రామకృష్ణ మిషన్ మాత్రం ఖండాంతరాలకు వ్యాపించింది.