విశాఖ మన్యంలో బంద్: భారీగా మోహరించిన పోలీసులు

విశాఖ మన్యంలో నిన్న(ఆదివారం) మావోయిస్టుల ఘాతుకానికి నిరసనగా గిరిజన సంఘాలు ఇవాళ, రేపు (మంగళవారం) ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిన్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి దారుణంగా కాల్చిచంపారు. ఎమ్మెల్యే హత్యకు నిరసనగా గిరిజన సంఘాలు ఇవాళ ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యతో ఏజెన్సీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మన్యం బంద్‌ దృష్ట్యా భారీగా పోలీసులు మోహరించారు. అరకు ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ బలగాలు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనకు అప్రమత్తమైన పోలీసులు మన్యంలోని అన్ని ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. విశాఖ నుంచి అరకుకు 12 స్పెషల్‌ పార్టీ పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఏజెన్సీలో 8 గ్రేహౌండ్స్‌ దళాలతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీలో రాజకీయ నాయకులు బయటకు వెళ్ల‌వద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy