విషాదం: బోరుబావిలోనే చిన్నారి మృతి

childఏం జరుగుతుందో…. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తదోనని అందరు భయపడ్డంతా జరిగింది. పాపకు ఎలాంటి ప్రమాదం జరగవద్దని…క్షేమంగా బోరు బావిలోంచి బయటకు రావాలని మొక్కిన మొక్కులు ఫలించలేదు. మూడు రోజులుగా  ఎదురుచూసిన తల్లిదండ్రులు… చిట్టితల్లి చనిపోయిందనే వార్త తెలిసి కన్నీరుమున్నీరైతున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో దాదాపు 60 గంటలపాటు ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయింది. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయాలని సిబ్బంది యత్నిస్తుండగా బోరు బావి నుంచి చిన్నారి అవశేషాలతో పాటు బట్టలు(ఫ్రాక్) బయటకు వచ్చినట్లు తెలిపారు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోందని, అయితే మృతదేహాన్ని తల్లిందండ్రులకు అప్పగించి వారికి పాప చివరిచూపును కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
బోరు బావి సమీప ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. గురువారం (జూన్22) 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి.. శుక్రవారం (జూన్23) బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం (జూన్ 24) ప్రత్యేక లేజర్‌ కెమెరాలతో పరిశీలించినా, లేటెస్ట్ మ్యాట్రిక్స్‌ వాటర్‌ప్రూఫ్‌ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఈ క్రమంలో ఆదివారం (జూన్25) ఉదయం ఎయిర్ ప్రెషర్ ద్వారా యత్నించగా.. చిన్నారి ఫ్రాక్ బయటకు రావడంతో పాటు బోరు బావి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో చిన్నారి మీనా మృతి చెందిందని..ఇది ఎంతో విషాధకరమని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy