విషాదం: బ్యాట్ త‌గిలి మృతి చెందిన క్రికెట‌ర్

Bat-And-Ball-Wallpaperపాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది.హైద్రాబాద్ పాతబస్తి బహదూర్ పురా పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని గ్రౌండులో యువకులు క్రికెట్‌ ఆడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.రమ్నస్త్ పురా ప్రాంతానికి చెందిన వాజీద్ అనే యువకుడు క్రికెట్‌ ఆడుతుండగా అతని ప్రక్కనే మరో పిచ్ మీద మరో టీమ్ ఆడుతుండగా ఆ బ్యాట్ ప్రమాదవశాత్తుగా వాజీద్ కు త‌గిలింది.బ్యాట్‌ తగలడంతో కింద ప‌డ్డాడు వాజీద్‌. అత‌న్ని హుటాహుటిన ఆసిపత్రికి తరలించారు . రెండ్రోజులుగా చికిత్స పొందుతున్న వాజీద్ మంగ‌ళ‌వారం మృతి చెందాడు.పొలీసులు కేసు న‌మోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.ఒకే గ్రౌండులో పదుల సంఖ్యలొ క్రికెట్‌ పిచ్ లు, అదే రీతిలొ వందల సంఖ్య‌లో క్రికెట్‌ ఆడే వారు ఉండటమే ఈ దారుణం జరిగి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy