విష్ణు ట్విట్ : ఆచారి అమెరికా యాత్ర వాయిదా

abఆచారి అమెరికా యాత్ర వాయిదా పడింది. ఈ నెల 26న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలరీత్యా వేసవికి వాయిదా పడినట్లు హీరో మంచు విష్ణు ట్విట్‌ చేశాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా  జనవరి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు మంచు విష్ణు సోమవారం (జనవరి-22) తన ట్విటర్‌ అకౌంట్‌లో తెలిపాడు. అయితే కారణాలు మాత్రం వెల్లడించలేదు.

దేనికైనా రెడీ, ఆడోరకం ఈడోరకం లాంటి వినోదాత్మక సినిమాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మానందం చాలా కాలంగా కమెడియన్‌గా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. మళ్లీ ఈ సినిమాతో తనేంటో చూపించాలనుకున్నాడు.  ఇంతలోనే ఈ సినిమా వాయిదా పడింది.  ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిగా, సింగం3 అనూప్‌ సింగ్ థాకూర్‌ విలన్ గా కనిపించనున్నాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy