వీటికి మార్కులేస్తారు: స్టూడెంట్స్ కు ట్రాఫిక్ పోలీస్ వీడియో గేమ్స్

trafficయాక్సిడెంట్లను తగ్గించేందుకు కొత్త దారిలో వెళుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు… వీడియోగేమ్స్ ప్లాన్ చేస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా విద్యార్థులే మరణిస్తున్నారు. బైక్ రేసింగ్స్, డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.  వీటిని సాధ్యమైనంతవరకు తగ్గించేందుకు బడి ఈడు నుంచే చిన్నారుల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలని నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం ఆ ఈడు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపే వీడియో గేమ్స్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. విద్యాశాఖతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించిన ట్రాఫిక్‌ పోలీసులు వారి అంగీకారం తర్వాత గేమ్స్‌ రూపకల్పనకు సన్నాహాలు చేయాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలయ్యే అవకాశం ఉంది.

ఇది అమలులోకి వస్తే ట్రాఫిక్‌ అన్నది ఓ పాఠ్యాంశంగా మారడమే కాకుండా పరీక్షల్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు, మార్కులు సైతం అమలులోకి వస్తాయి. ఇవి కేవలం థియరీ అని అధికారులు చెప్తున్నారు.  అలాగే ఈ ట్రాఫిక్‌ వీడియో గేమ్స్‌ అన్నది నామ్‌కే వాస్తేగా మారకూడదని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ఈ గేమ్స్‌పై పరీక్షలు సైతం నిర్వహించడంతో పాటు మార్కులు వేసేలా చర్యలు తీసుకోనున్నారు. తొలిదశలో ఆరో తరగతి వరకు, అనంతరం పదో తరగతి వరకూ అనువుగా ఉండే అంశాలతో కూడిన గేమ్స్‌ డిజైన్‌ చేయిస్తారు. భవిష్యత్తులో కాలేజీ విద్యార్థులకూ అవసరమైన, ఆసక్తి ఉండే అంశాలతో వీటిని రూపొందించాలనే ప్రతిపాదనా ఉంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy