వీడికి భయమంటే తెలుసా…

2CF8912A00000578-0-image-a-17_1443712745498ఈ పక్క ఫోటో చూస్తుంటే… ఆహా..! బొమ్మను భలే వేలాడదీశారే అనిపిస్తోంది కదూ.. అబ్బే అదేం లేదు. బొమ్మ కాదు.. మనిషే. రెండేళ్ల పిల్లాడు వీడు. పేరు తెలియదు కానీ వీడి ఊరు రష్యాలోని చెల్యాబిన్క్ రీజియన్ కు చెందిన మియాస్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాడు నిల్చోంది ఎనిమిదో ఫ్లోర్. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నూటికి వెయ్యిపాళ్లు నిజం.  వాళ్ల అమ్మ ఏదో పనిమీద కిటికీ తీసి వెళ్లిపోతే… మనోడు ఎంచక్కా కిటికీ ఎక్కి నానా హంగామా చేశాడు. అటూ ఇటూ ఊగుతూ.. పైకి కిందకు చూస్తూ.. ఎంజాయ్ చేశాడు. డ్యాన్స్ చేశాడు. పిషప్ చేశాడు. అల్లరి కృష్ణుడిలా రెచ్చిపోయాడు. అయితే ఈ విషయం వాళ్లమ్మకి అసలేం తెలియదు. పొరుగింటోళ్లు.. దారినపోయేవాళ్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి.. వాళ్ల అమ్మను అలర్ట్ చేసే వరకు వీడి ఆటే ఆట. పాటే పాట. బుజ్జగించి.. లాలించి దగ్గరకు తీసుకుంది ఆ పిచ్చి తల్లి. “ఒక్క నిమిషం ఆలస్యమైనా.. నా ప్రాణం పోయేదేది. వాడెప్పుడు అలా చేయలేదు.. వెలుతురు కోసం కిటికీ తీస్తే.. వెంటేనే కిటికీ ఎక్కి ఇంత అల్లరి చేశాడు” అంటూ స్థానిక మీడియాతో తన భయంకర అనుభవాన్ని పంచుకుంది. దీన్నంతా వీడియో తీశాడు ఓ దారిన పోయే దానయ్య. ఇప్పుడిది వైరల్ గా మారింది. వీడి చేష్టలు చూసి విరగబడి నవ్వుకుంటూనే.. భయపడ్డామంటున్నారు నెటిజన్లు.

2CF8912300000578-0-image-a-18_14437127644052CF8923F00000578-0-image-a-21_1443712794120

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy