వీడిని ఏం చేసినా తప్పులేదు.. కన్న బిడ్డను గొంతు నులిమి చంపేశాడు

యాదాద్రి భువనగిరి జిల్లా : వీడికి మానవత్వం లేదు. కన్న ప్రేమ అంతకన్నాలేదు. భార్యను వదిలించుకునే ఆలోచనతో కన్నబిడ్డను చంపేశాడు. లోకం చూడని పసిపాపను పాశవికంగా కడతేర్చాడు.

కన్నతండ్రే కసాయిగా మారి.. మూడు  నెలల వయసున్న కన్న కూతురుని హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని కొయ్యలగూడెంలో జరిగింది. కొయ్యలగూడానికి చెందిన సిలివేరు శివ, రామంత పూర్ కి చెందిన అక్షరను 14 నెలల కింద పెళ్లిచేసుకున్నాడు. 3 నెలలు బాగానే కాపురం చేశారు. తరువాత భార్య అక్షర నచ్చలేదని, తరచు గొడవకు దిగుతుండే వాడు. పెళ్ళైన 3 నెలల నుండే గొడవ పడుతూ తరుచూ పుట్టింటికి పంపేవాడు. ఈ సమస్యని పరిష్కరించడానికి పెద్దలు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా శివ ప్రవర్తన మారలేదు.

భార్యను వదిలించుకుందామని ప్లాన్ చేశాడని…. భార్య గర్భవతి కావడంతో… పుట్టింటి వద్దే ఉంచాడని ఆమె తరఫున బంధువులు చెప్పారు. భార్య ప్రసవించి ఆడపిల్లకు జన్మనిచ్చింది. భార్యను వదిలించుకునేందుకు తన బిడ్డే అడ్డంగా ఉందని తండ్రి శివ. పాప పుట్టినప్పటి నుంచి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూశాడు. పుట్టింటినుంచి తన ఇంటికి వచ్చినప్పుడు.. భార్య పక్కన లేని సమయం చూసి.. మానవత్వం మరిచిపోయాడు. కన్న బిడ్డనే తన చేతులతో గొంతు నులిమి చంపేశాడు. పాపం … పసిదాని ప్రాణం పోయిందని నిర్ణయించుకుని… వెంటనే పరారయ్యాడు. కన్నబిడ్డనే చంపుకున్నాడు కసాయోడు అంటూ… భార్య తరపు బంధువులు శివ ఇంటి ముందు ఏడుస్తూ… ఆందోలన చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy