వీడి అగాయిత్యం పాడుగాను : లయన్ ఎన్‌క్లోజర్‌లోకి దూరాడు

kerala-zooఇటీవల కేరళలో ఓ వ్యక్తి బాహుబలి సినిమాలోని ఏనుగు ఫీట్ చేద్దామనుకుని కంగుతిన్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో మురుగన్ అనే వ్యక్తి ఏకంగా సింహాలతోనే చిట్‌చాట్ చేయాలనుకున్నాడు. అనుకున్న వెంటనే మురుగన్ ఉదయం 11:45 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డుకు తెలియకుండా సందర్శకులను తోసుకుంటూ తిరువనంతపురం జూలోకి ప్రవేశించాడు. మురుగన్ జూలో నడుచుకుంటూ కాకుండా అంబాడుకుంటూ వెళ్లాడు. మురుగన్ చేష్టలతో ఆశ్చర్యానికి లోనైన జూ సందర్శకులు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. జూ అధికారులు అక్కడికి చేరుకుని మురుగన్ ను బయటకు తీసుకొచ్చారు.

మురుగన్ ను కేరళలోని పాలక్కాడ్ వాసిగా గుర్తించారు. వారం రోజుల క్రితం మురుగన్ తన ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులు మురుగన్ కోసం మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లే క్రమంలో మురుగన్‌కు స్వల్పగాయాలయ్యాయని..అతనిని ఆస్పత్రిలో చేర్పించామని జూ అధికారి ఒకరు వెల్లడించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy