వీడి తెలివి తెల్లారా : డ్రగ్స్ బ్యాగ్ పోయిందని పోలీసులకు కంప్లయింట్

r-david-blackmon-stolen-coహైదరాబాద్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతుండగా..డ్రగ్స్ బ్యాగ్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన మనదగ్గర జరగకపోయినా..ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అమెరికా ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ బ్లాక్ మన్ ఓ డ్రగ్ డీలర్. కొకైన్ ప్యాకెట్లను సంచుల్లో నింపి తరచుగా తన కారులో సరఫరా చేస్తుండేవాడు. గతవారం డేవిడ్ డీల్ లో భాగంగా బ్యాగ్ నిండా కొకైన్, ఇతరత్రా మాదకద్రవ్యాలను నింపాడు. తన కారులో వాటిని తీసుకెళ్లి వాల్టన్ బీచ్ కు వెళ్లాడు.

కారు పార్క్ చేసి కొద్దిసేపు పక్కకు వెళ్లగా కారు అద్దాలు పగలగొట్టి  డ్రగ్స్ బ్యాగ్ లు చోరీ చేశారు కొందరు దుండగులు. తన డ్రగ్స్ బ్యాగును వెతికిపెట్టాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన డేవిడ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న కారణంగా అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

నిందితుడు డేవిడ్ తనకు మంజూరైన 4వేల డాలర్ల పూచికత్తు బెయిల్ పై విడుదలయ్యాడు. ప్లోరిడా పోలీసులు జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ.. నిందితుడి ఫొటోను అధికారిక ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. వీడి తెలివి తెల్లారినట్లే ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy