వీడు మామాలు దొంగ కాదు : ఇంటి చుట్టూ 32 సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు

GANGఅతడి ఇళ్లు చూస్తే జడ్+ సెక్యురిటీ ఉన్న పెద్ద రాజకీయ నాయకుడిదని అనుకుంటారు. ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు, రికార్డ్ అయిన ఫీడ్ ను చూడడానికి డిజిటల్ వీడియో రికార్డర్ లు. అసలు ఇంతకీ ఆ ఇళ్లు ఏ రాజకీయనాయకుడిదో, ఉన్నతాధికారిదో కాదండోయ్. అదియ ఓ గజదొంగ ఇళ్లు. భద్రత కోసం ఈ హైటెక్‌ దొంగ ఏర్సాటు చేసుకొన్న సెక్యూరిటీని చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు.
సిటీలోని టోలీచౌకీలోని సూర్యనగర్‌లో నివసిస్తున్న ఖాజం అలీ కొంతకాలం నుండి వ్యసనాలకు బానిసై తన స్నేహితులతో కలసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో కొన్నిసార్లు జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టు అయినప్పుడు పోలీసులు ఇతడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న అలీ 2016 జూన్‌ 28న బయటకు వచ్చాడు. ఎలక్ట్రీషియన్‌ ముసుగులో ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌తో తిరుగుతూ పట్టపగలే ఇళ్లలో చోరీలకు పాల్పడే ఖాజం అలీని పోలీసులు అత్యాధునిక పాపిల్లన్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 18 లక్షల విలువైన 55 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలీ ఇల్లు ఒకప్పుడు అక్కడి ఫ్లై ఓవర్‌ పక్కన ఉండేది. ఈ ఇంటి స్థలానికి సంబంధించి గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ తో వీరి కుటుంబానికి విభేదాలు ఉన్నాయి. దీంతో నయీమ్‌ నుంచి హాని ఉంటుందన్న ఉద్దేశంతో ఖాజం తన ఇంటి చుట్టూ 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీటిలోని ఫీడ్‌ను రికార్డ్‌ చేయడానికి నాలుగు డీవీఆర్‌ లు ఏర్పాటు చేసుకున్నాడు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ అయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీసీ కెమెరాలు కొనసాగించాడు. ఇతడి ఇంటిని చూసిన పోలీసులు అతడి సక్యూరిటీ విధానం చూసి ఆశ్యర్యపోయారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy