వీడు మామూలోడు కాదు : షీ టీమ్ కానిస్టేబుల్ నే వేధించాడు

636384477668658666ఏకంగా షీ టీమ్స్‌ మహిళా కానిస్టేబుల్‌కే ఫోన్‌ చేసి అసభ్యపదజాలంతో వేధించాడా ప్రబుద్ధుడు. పైగా తనపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే కక్షతో ఆమె నంబరును ఓ పోర్న్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశాడు. నిత్యం వందలకొద్దీ ఫోన్లు వస్తుడటంతో మహిళా కానిస్టేబుల్‌… పోలీసులకు ఫిర్యాదు చేయడడంతో ఎట్టకేలకు ఆ పోకిరిని అరెస్టు చేశారు. రాచకొండ షీటీమ్స్‌ ఏసీపీ స్నేహిత వివరాల ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా, పరకాల మండలం, సాగరవిడి గ్రామానికి చెందిన బీరం నిఖిల్‌ కుమార్‌.. ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. నిరుడు మంచాలలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని మొబైల్‌ నంబర్‌కు అసభ్యకర సందేశాలు పంపాడు. ఫోన్‌ చేసి ఇబ్బందులకు గురిచేశాడు. అతడి వేఽధింపులకు విసిగిపోయిన బాధితురాలు నిరుడు అక్టోబరు 14న రాచకొండ పోలీసులకు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. బాధితురాలి నుంచి ఇబ్రహీంపట్నం షీ టీమ్స్‌ ఏఎస్సై నర్సింహరెడ్డి ప్రాథమిక సాక్ష్యాలకు సేకరించారు.

అయితే, రాత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకురాలేదు. అంతకముందు విచారణలో భాగంగా నిఖిల్‌ కుమార్‌కు షీటీమ్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఫోన్‌ చేశారు. వివరాలు అడుగుతున్న సమయంలో అతడు పరుష పదజాలంతో మాట్లాడాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఫోన్‌ నంబరుకూ అసభ్యకర సందేశాలు పంపాడు. పలుమార్లు ఆమె హెచ్చరించినా విన్లేదు. అతడి ఆగడాలు మితిమీరడంతో ఆమె జనవరి 23న ఇబ్రహీంపట్నం ఠాణాలో పిర్యాదు చేశారు. తన మీద కేసు పెట్టడంతో మరింత కోపం పెంచుకున్న నిఖిల్‌.. సదరు మహిళా కానిస్టేబుల్‌ ఫోన్‌ నంబరును ఒక పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. కొన్నాళ్లుగా ఆమెకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వందల కొద్ది ఫోన్లు వచ్చాయి. వారంతా అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో మనస్తాపానికి గురైన కానిస్టేబుల్‌.. పోలీసులకు విషయం చెప్పింది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న షీటీమ్స్‌, పోలీసులు బీరం నిఖిల్‌ కుమార్‌ను వరంగల్‌లో మంగళవారం అరెస్ట్‌ చేశా రు. ఆకతాయిలు వేధిస్తే మహిళలు నిర్భయంగా వాట్సప్‌ నంబరు 9490617111కు సందేశం రూపంలో ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సూచించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy