వీడెవడండీ బాబు: 25 పెళ్లిళ్లు..146 మంది పిల్లలు

25 marriagesబహుభార్యత్వం కేసులో విన్‌స్టన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

పాతికేళ్లలో 25 పెళ్ళిల్లు చేసుకున్నాడు.. 146 మంది పిల్లలను కన్నాడు.. ఈ సంఘటన  కెనడాలో ఓ మాజీ మతపెద్ద నిర్వాకం. బహుభార్యత్వం కేసులో ప్రస్తుతం ఐదేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న ఆయన పేరు విన్‌స్టన్‌ బ్లాక్‌మోర్‌. వయసు 61 ఏళ్లు. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సులోగల బౌంటిఫుల్‌ అనే ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్‌స్టన్‌ 1990 నుంచి ఇప్పటివరకు 25 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారితో కాపురం చేసి 146 మంది పిల్లలను కన్నాడు. వాస్తవానికి 1990ల్లోనే విన్‌స్టన్‌ బహుభార్యత్వంపై ఆరోపణలు వచ్చాయి. అయితే, బహుభార్యత్వానికి సంబంధించి కెనడా చట్టాల్లో ఉన్న లొసుగులతో విన్‌స్టన్‌ శిక్షల నుంచి తప్పించుకోగలిగాడు. అయితే, 2011లో కెనడాలో బహుభార్యత్వాన్ని న్యాయస్థానం నిషేధించింది. ఆ తర్వాత కూడా విన్‌స్టన్‌ వివాహాలు చేసుకున్నాడు. దీంతో ఆయన మాజీ భార్య ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో విచారణ నిర్వహించిన బ్రిటిష్‌ కొలంబియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి షెరీ ఆన్‌ డొనెగాన్‌ విన్‌స్టన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. పాతిక వివాహాలు చేసుకోవడంపై విన్‌స్టన్‌ స్పందిస్తూ భగవంతుడి ఆదేశాల మేరకే తాను అన్ని పెళ్లిలు చేసుకున్నానంటున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy