వీణా-వాణిలకు ఆపరేషన్ సాధ్యమే

veena -vaniఅవిభక్త కలవలు వీణా-వాణిలకు ఆపరేషన్ చేయటం సాధ్యం అవుతుందన్నారు ఎయిమ్స్  డాక్టర్లు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) చెందిన ముగ్గురు సభ్యుల న్యూరో డాక్టర్ల టీం గురువారం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి వచ్చింది. అవిభక్త కవలలైన వీణ-వాణిల సర్జరీ సాధ్యాసాధ్యాలు.. వైద్య పరీక్షలపై  ఈ టీం  పరిశీలన జరిపింది. వీణా-వాణిలకు సర్జరీ సాధ్యం అవుతుందని తెలిపారు. త్వరలో వీరిని ఢిల్లీ ఎయిమ్స్ కు తీస్కెళ్లనున్నట్లు ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు.  వీణా-వాణీలకు దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని… ఇందుకు 9 నుంచి 12 నెలల టైం  అవకాశం ఉందని లండన్ డాక్టర్లు  గతంలోనే చెప్పారు. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని.. వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. లండన్ డాక్టర్లను  రప్పించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే సర్జరీ  చేయించాలని నిర్ణయించింది. దీంతో ఎయిమ్స్ డాక్టర్లను తో ప్రభుత్వం కాంటాక్ట్  చేసింది. ఇందులో భాగంగనే  వీణా-వాణిలను డాక్టర్లు పరిశీలించారు. ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత  లండన్ డాక్టర్లతోనూ ఆ బృందం సమాలోచనలు జరుపనుంది. వీణా-వాణిలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్న ఎయిమ్స్ డాక్టర్లు..వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారని  తెలిపారు. అయితే ఢిల్లీలో మరికొన్ని మెడికల్ టెస్టులు చేయాల్సి ఉందని…ఆ పరీక్షల నిర్వహణ తర్వాతే సర్జరీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy