వీధి వ్యాపారులకు రిలీఫ్

వీధివ్యాపారుల చట్టానికి రాజ్యసభ ఓకే చెప్పింది. లోక్ సభ ఇంతకుముందే ఈ బిల్లును పాస్ చేసింది. ఈ బిల్లు వల్ల వీధివ్యాపారులకు ఎంతో రిలీఫ్ వస్తుంది. రోడ్డు పక్కన పళ్ళు, కూరగాయలు, పానీ పూరీలు, పల్లీలు – బటానీలు, బట్టలులాంటివి అమ్ముకునే వాళ్ళను తరిమేసే పోలీసులనుంచి, సామాను లాక్కునే మున్సిపల్ అధికారులనుంచి కాపాడే క్లాజులు ఈ బిల్లులో చేర్చారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక కమిటీ ఏర్పాటుచేసి, కమిటీ నిర్ణయం ప్రకారం వీధివ్యాపారులకు లైసెన్సులు జారీ చేస్తారు. ఈ కమిటీలో మెంబర్లుగా 40 శాతం మంది వీధివ్యాపారులే ఉంటారు. అందులోనూ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. ప్రతి పట్నంలో కొన్ని జోన్లు నోటిఫై చేసి, అక్కడే వ్యాపారం చేసుకునే వీలు కల్పిస్తారు. వాళ్ళ సంక్షేమానికి కూడా ఈ బిల్లులో కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy