వీరసావర్కర్ ను అవమానించారు.. రాహుల్ పై కేసు పెట్టిన ముని మేనల్లుడు

ముంబై : స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ – వీర సావర్కర్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. తనను జైలు నుంచి విడుదల చేయడానికి వీలుగా…. బ్రిటీష్ వారికి వీరసావర్కర్ క్షమాపణలు చెప్పారని.. రాహుల్ గాంధీ ఛత్తీస్ గఢ్ బహిరంగ సభలో కామెంట్స్ చేశారు. దేశభక్తి గురించి తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని.. త్యాగధనుల చరిత్ర తమకు ఉందన్నారు. ఎన్నికల బహిరంగ సభలో వీరసావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ కుటుంబసభ్యులు అభ్యంతరం చెబుతున్నారు.

ముంబైలోని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీపై కేసు పెట్టారు ముని మేనల్లుడు ఆర్.సావర్కర్. దేశంకోసం ప్రాణాలర్పించిన వీరసావర్కర్ ప్రతిష్ఠను దెబ్బతీయాలని రాహుల్ గాంధీ చూశారని.. అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. బ్రిటీష్ వారి పాలనలో సావర్కర్ 27 ఏళ్లపాటు జైల్లోనే గడిపారని చెప్పారు. సావర్కర్ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన రాహుల్ గాంధీపైన పోలీసులకు కంప్లయింట్ చేశానని చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy