వీరాభిమానం: డైరెక్టర్ పూరీకి విగ్రహం

puri (2)సౌత్ ఇండియాలో సినీ స్టార్లకు విగ్రహాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం. తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఓ  వీరాభిమాని. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో పల్లపు ప్రభాకర్ అనే వ్యక్తి పూరీ జగన్నాథ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విగ్రహాన్ని పూరీ తనయుడు ఆకాశ్ ఆవిష్కరించాడు. అంతేకాదు విగ్రహంతో సెల్ఫీలు దిగాడు. తన జీవితంలో మర్చిపోలేని రోజంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విగ్రహాన్ని అందంగా చెక్కిన శిల్పిని ఆకాశ్ కి అభినందనలు తెలిపాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy