వీరి ప్రేమ.. అలాంటి వారికి ఓ దారి చూపుతోంది

mumbai-transgender-coupleచిన్ననాటి నుంచి సతమతమయ్యే ఆలోచనలతో తీవ్రంగా మధనపడిన ఈ ఇద్దరు.. ఇప్పుడు ఒకటికానున్నారు. వీరిద్దరిది సమాజానికి చెప్పుకోలేని బాధ. యుక్తవయస్సుకు రాగానే.. తోటి వారిని చూస్తే చెప్పలేని ఆకర్షణ. దాన్నుంచి బయటపడేది ఎలాగో తెలియదు. అలాంటి వీరిద్దరిని కలిపింది ముంబై. పెళ్లిచేసి.. నలుగురికి దారి చూపేస్థాయికి చేర్చింది. వారే ఆరవ్‌ అప్పుకుట్టన్‌, సుకన్యే కృష్ణ. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని లింగ మార్పిడి కేంద్రంలో ఒకరికి మరొకరు పరిచయం అయ్యారు. ఆరవ్‌ అబ్బాయిగా మారితే.. సుకన్యే అమ్మాయిగా రూపాంతరం చెందారు. ఆరవ్ వయస్సు 46 ఏళ్లు.. సుకన్యే వయస్సు 21 ఏళ్లు. కొన్నాళ్ల వీరి స్నేహం.. ప్రేమగా మారింది. ఒకరికొకరు తమ గుండెల్లో దాగిన మాటలను చెప్పుకుని ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకుని.. ప్రస్తుతం ఆనందంగా జీవనం సాగించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం వాళ్లిద్దరూ తమలాంటి వారికి సాయం చేసేపనిలో పడ్డారు. తమలా బాధపడుతున్న వ్యక్తులకు సాయం చేసి.. వారి జీవితాల్లో వెలుగు నింపాలనే దేదిప్యమానమైన ఆలోచన. దాన్ని ఆచరణలో పెట్టేందుకు సోషల్‌మీడియాను మార్గంగా ఎంచుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఓ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. జీఐడీతో బాధపడుతున్న వ్యక్తులు ఈ గ్రూపులో తమ సమస్యలు చెప్పుకొవచ్చు. గ్రూపులో డాక్టర్లు కూడా ఉన్నారు. బాధితులకు వారు సలహాలు అందిస్తారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy