వీళ్లు ఓపెన్ అయ్యారు : మాకే పాపం తెలియదు.. నమ్మండి

tollywood-actorsసినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ప్రకంపనలు రేపుతోంది. ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తుండటంతో కలకలం అవుతోంది. అధికారికంగా ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వెల్లడించకపోయినా.. మీడియాలో వస్తున్న కథనాలు సంచలనం అయ్యాయి. పేర్లు, ఫొటోలతో సహా లీకులు రావటంతో.. అందరిలో కంగారు మొదలైంది. దీంతో కొందరు నటలు బయటకు వచ్చారు. వార్తలపై స్పందించారు.

సంబంధం లేదు : తనీష్

డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు టాలీవుడ్ యువ నటులు తనీష్. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. అసలు డ్రగ్స్ అంటే ఏంటో కూడా తెలియదన్నాడు. తన తండ్రి బతికి ఉంటే ఇలాంటివి ఏమీ పట్టించుకునేవాడిని కాదని.. ఇంటికి పెద్ద దిక్కు నేనే కాబట్టి బయటకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తర్వత అయినా నోటీసులు వస్తే.. విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశాడు.

నాకే అర్థం కావటం లేదు : సుబ్బరాజు

డ్రగ్స్ రాకెట్ లో నా పేరు బయటకు రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు. నోటీసులు ఇంటికే వచ్చాయని.. అందుకున్నట్లు స్పష్టం చేశాడు. జూలై 21వ తేదీన విచారణకు హాజరవుతున్నట్లు తెలిపాడు. నాకుగానీ.. నా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరికీ డ్రగ్స్ అలవాటు లేదని తెలిపాడు. అయినా వారం రోజుల్లో అని నిజాలు తెలుస్తాయని.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అన్నారు.

నాకే ఆశ్చర్యంగా ఉంది : ఆర్ట్ డైరెక్టర్ చిన్నా

డ్రగ్స్ రాకెట్ తో ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ చిన్నా. పేపర్లు, టీవీల్లో నా పేరు చూసి షాక్ అయ్యానని చెబుతున్నాడు. కనీసం సిగరెట్ కూడా తాగని నాకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నారు. ఈ వ్యవహారంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. అధికారుల నుంచి ఇప్పటి వరకు నోటీసులు అందలేదని చెప్పారు చిన్నా.

డ్రగ్స్ అలవాటే లేదు : హీరో నందు

డ్రగ్స్ అలవాటే లేదని.. ఎప్పుడూ చూడలేదు అంటున్నాడు యంగ్ హీరో నందు. ఇప్పటి వరకు నోటీసులు అందలేదన్నాడు. నా పేరు బయటకు రావటం ఆశ్చర్యంగా ఉందన్నాడు. ఈ కేసుతో సంబంధం లేదన్నాడు. ఏ పరీక్షకు అయినా సిద్ధం అని వెల్లడించాడు.



Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy