వీళ్లు మనుషులేనా: ఆడపిల్ల పుట్టిందని గొడ్డును బాదినట్లు బాదారు

Woman-beaten-up-brother-in-lawఅన్ని రంగాల్లో పురుషలతో సమానంగా పోటీ పడుతున్న ఈరోజుల్లో కూడా మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అమానుషానికి పాల్పడిందో కుటుంబం. సమీప బంధువు, మరో వ్యక్తి ఓ మహిళపై హాకీ స్టిక్స్‌తో విచక్షణారహితంగా కొట్టారు. పంజాబ్‌లోని పాటియాలాలో  ఈ దారుణం జరిగింది. బహిరంగంగా ఆమెను ఆ దుర్మార్గులు చితుకబాదుతుంటే  అడ్డుకునేందుకు  ఎవరూ ముందుకు రాలేదు.   ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే అత్తింటి వేధింపులకు తాళలేక మీనా కశ్యప్ తన భర్త దల్జీత్‌ సింగ్‌ తో కలిసి వేరు కాపురం పెట్టింది. వీరిద్దరికి రెండేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. మీనా ఈ  మధ్యనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదును కోసం చూస్తున్న అత్తింటి కుటుంబం … ఇదే సాకుగా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ దల‍్జీత్‌ సోదరుడు, అతని స్నేహితుడు ఆమెను హాకీస్టిక్‌లతో చావగొట్టారు. ఈ వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy